క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన సౌతాఫ్రికా.. తాజాగా జరిగిన ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఛాంపియన్లుగా అవతరించింది. 27 ఏళ్ల తర్వాత ICC ట్రోఫీని గెలుచుకోవడం సౌత్ ఆఫ్రికాకు ఒక చారిత్రక విజయం. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టెస్ట్ క్రికెట్లో నెం.1 ర్యాంకుకు చేరుకుంటుందని చాలా మంది భావించారు. అయితే, ప్రస్తుత ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఆఫ్రికా ఇంకా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. మరి ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ నెం.1 స్థానం ఎందుకు దక్కలేదో ఓసారి చూద్దాం..
ప్రస్తుత ర్యాంకింగ్స్ పరిస్థితి..
తాజా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ ప్రకారం, ఆస్ట్రేలియా 126 రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ 113 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉండగా, సౌత్ ఆఫ్రికా 111 రేటింగ్‌తో మూడో స్థానంలో నిలిచింది. ఇండియా 105 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉంది.
WTC ఫైనల్ విజయం.. నెం.1కి ఎందుకు దారి తీయలేదు?
WTC ఫైనల్ అనేది ఒక టోర్నమెంట్ విజయం. టెస్ట్ ర్యాంకింగ్స్ అనేది సుదీర్ఘకాలం పాటు వివిధ సిరీస్‌లలో జట్ల ప్రదర్శన ఆధారంగా లెక్కిస్తారు. ICC టెస్ట్ ర్యాంకింగ్స్ పాయింట్లు గత మూడు, నాలుగు సంవత్సరాలలో ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఫలితాలను బట్టి కేటాయిస్తారు. ఒకే ఒక ఫైనల్ మ్యాచ్ గెలవడం ద్వారా ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు జరగవు.
సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఏడెన్ మార్క్రామ్ శతకం, కెప్టెన్ టెంబా బావుమా నాయకత్వ పటిమ, కగిసో రబడ బౌలింగ్ అసాధారణంగా ఉన్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి, ప్రొటిస్ తమ సత్తా చాటారు. ఈ విజయం వారికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను తెచ్చిపెట్టింది తప్ప, అది టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నేరుగా నెం.1 స్థానాన్ని ఇవ్వలేదు.
సౌత్ ఆఫ్రికా ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం గొప్ప విషయం. అయితే, ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవాలంటే వారు నిలకడగా రాణించాలి. రాబోయే టెస్ట్ సిరీస్‌లలో అద్భుత ప్రదర్శన కనబరిస్తేనే వారు నెం.1 స్థానాన్ని దక్కించుకోగలరు. ప్రస్తుతం వారు సరైన మార్గంలోనే ఉన్నారని చెప్పడంలో సందేహం లేదు. ఈ విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..