
వెల్లుల్లి నీటిలో అలిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది శరీరాన్ని కాపాడే శక్తిని పెంచుతుంది. వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి వాటితో పోరాడే శక్తిని ఇస్తుంది. రోజూ తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి నీరు రక్తనాళాలను రిలాక్స్ చేస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇది పేగుల్లోని వ్యర్థాలను తొలగిస్తుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం లాంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. శరీరం పనులు చురుగ్గా సాగేందుకు ఇది సహాయపడుతుంది.
వెల్లుల్లి నీరు శరీరంలోని మెటబాలిజాన్ని వేగంగా పనిచేయిస్తుంది. దీని వల్ల శరీర కొవ్వు త్వరగా కరుగుతుంది. ఆకలిని కూడా ఇది తగ్గిస్తుంది. దీంతో ఎక్కువ తినడం ఆగిపోతుంది. బరువు తగ్గడానికి సాయం చేస్తుంది.
వెల్లుల్లిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి కాపాడతాయి. ఇది చర్మాన్ని సహజంగా మెరిసేలా చేస్తుంది. ముడతలు, వృద్ధాప్య ఛాయలు తక్కువగా కనిపించేలా చేస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా కనిపిస్తుంది.
ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నలిపి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ఇలా కొన్నాళ్ళు చేస్తే మీ శరీరంలో మంచి మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)