రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో కొత్తగా 200 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోంది. రైల్వే ప్రయాణాలపై ప్రయాణికులు చూపిస్తున్న ఆసక్తి నేపథ్యంలో వారికి సౌకర్య వంతమైన ప్రయాణాలు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్తగా 50 నమో భారత్ రైళ్లు, 100 మెమూ రైళ్లు, 50 అమృత్ భారత్ రైళ్లు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా చేసిన పోస్టు ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అత్యాధునిక వసతులతో కూడిన ఈ రైళ్ల వీడియోను ఆయన షేర్ చేశారు. అయితే, ఈ రైళ్లును ఎప్పుడు అందుబాటులోకి తీసుకురాబోతున్నారనే వివరాలను మాత్రం ఆయన పేర్కొనలేదు.
यात्रियों की सुविधा के लिए:
🚉 50 नई नमो भारत ट्रेन 🚉 100 नई MEMU ट्रेन🚉 50 नई अमृत भारत ट्रेन pic.twitter.com/2hM92vq3Ep
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) June 17, 2025
మరోవైపు, హరియాణాలోని మనేసర్‌లో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్‌ను మంగళవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిప ఆయన ప్రయాణికుల రైల్వే శాఖ అందిస్తున్న సేవలను మెరుగు పరచడం కోసం ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెమూ రైళ్ల కోచ్‌ల సంఖ్యను 8-12, నుంచి 16-20 పెంచుతున్నట్టు చెప్పారు. దీంతో తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులకు లబ్ది చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మెమూ రైళ్ల తయారీ కోసం కాజీపేటలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు కొత్తగా 50 నమో భారత్ రైళ్లను తయారు చేసేందుకు కూడా రైల్వే శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..