Yash-Kiara: కన్నడ స్టార్ హీరో యశ్‌ గొప్ప మనసు.. గర్భంతో ఉన్న కియారా కోసం ఏం చేశాడంటే?

Yash-Kiara: కన్నడ స్టార్ హీరో యశ్‌ గొప్ప మనసు.. గర్భంతో ఉన్న కియారా కోసం ఏం చేశాడంటే?


‘కేజీఎఫ్ 2’ తర్వాత నటుడు కన్నడ నటుడు యశ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు అతనికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే పాన్ ఇండియా హీరో అయినా యశ్ ఎప్పుడూ సింపుల్ గానే ఉంటాడు. అభిమానులకు ఎంతో గౌరవమిస్తాడు. వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ప్రస్తుతం యష్ ‘ టాక్సిక్ ‘ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. గీతు మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకురాలు. ఇందులో యశ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, నయనతార హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో కియారా అద్వానీ కోసం యశ్ తీసుకున్న ఒక నిర్ణయం అందరి మన్ననలు అందుకుంటోంది. అదేంటంటే.. ‘టాక్సిక్’ సినిమాను బెంగళూరు, ముంబై, గోవా సహా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించారు. ముందుగా ఈ సినిమా షూటింగ్ బెంగళూరులో జరగాల్సి ఉంది. అయితే అదే సమయంలో హీరోయిన్ కియారా అద్వానీ గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న హీరో యశ్ ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌ను బెంగళూరు నుంచి వెంటనే ముంబైకి మార్చాడట. ‘టాక్సిక్’ సినిమాను కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాకి వెంకట్ నారాయణ్ నిర్మాత. కాగా ఈ సినిమా నిర్మాతలలో యశ్ కూడా ఒకరు. అందుకే వెంకట్ ని రిక్వెస్ట్ చేసిన తర్వాత బెంగళూరులో జరగాల్సిన షూటింగ్ ని ముంబైకి మార్చాడు రాకింగ్ భాయ్.

కియారా ఫిబ్రవరిలో తాను గర్భవతినని ప్రకటించింది. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఈ విషయం తెలుసుకున్న యశ్ కియారా కోసం వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో యశ్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. యశ్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడంటూ సినీ అభిమానులు, నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమాలో యశ్..

కాగా ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న సినిమా ‘టాక్సిక్’ కాబట్టి, ‘టాక్సిక్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. ముంబైలో ఉంటున్న ప్రముఖ బ్రిటీష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *