Headlines

లవర్‌ను కలిసేందుకు రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లిన యువతి.. కట్‌చేస్తే.. 5 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం!

లవర్‌ను కలిసేందుకు రాత్రి ఇంట్లో నుంచి బయటకెళ్లిన యువతి.. కట్‌చేస్తే.. 5 రోజుల తర్వాత వెలుగు చూసిన దారుణం!


ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని అతి కారతకంగా హత్య చేసి భూమిలో పూడ్చిపెట్టిన ఘటన రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్‌లో వెలుగు చూసింది. పర్సోలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆద్ గ్రామానికి చెందిన భూలా మీనా (19), పాట్ల బావ్ది గామానికి చెందిన లఖ్మా అలియాస్ కన్హయ్య కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే జూన్ 12వ తేదీని భర్కుండిలోని తన సోదరి ఇంటికి వెళ్లిన మీనా.. రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన ప్రియుడిని కలిసేందుకు బయటకు వెళ్లింది. అనుకున్న ప్రకారం ప్రియుడిని కలుసుకుంది. అయితే మీనా తనను పెళ్లి చేసుకోమని కన్హయ్యను ఒత్తిడి చేసిందని.. కానీ పెళ్లికి సిద్ధంగా లేని కన్హయ్య.. ఆమెను  అడ్డుతొలగించుకోవాలనుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే కన్హయ్య దుపట్టాతో మీనా గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. మీనా చనిపోయిందని కన్ఫామ్‌ చేసుకున్నాక మృతదేహాన్ని తన ఇంటి సమీపంలో పాతిపెట్టి కన్హయ్య పరారైనట్టు పోలీసులు తెలిపారు.

అయితే ఉదయం ఇంట్లో మీనా కనిపించకపోవడంతో కంగారు పడిన తన సోదరి ఆమె కోసం వెతకడం స్టార్ట్‌ చేశారు. మీనా కోసం చుట్టుపక్కల మొత్తం విచారించారు. ఈ క్రమంలోనే మీనా, కన్హయ్య అనే యువకుడితో ప్రేమలో ఉన్నట్టు తెలుసుకున్నారు. దీంతో మీనా అతడి వెంటే వెళ్లిపోయి ఉంటుందని గ్రహించిన కుటుంబీకులు విషయం పోలీసుల వరకు వెళ్తే పరుగుపోతుందని వారే మీనా కోసం వెతకడం మొదలు పెట్టారు. రెండు రోజుల పాటు ఎంత వెతికినా ఆచూకీ లభించపోవడంతో.. ప్రియుడి కన్హయ్య ఇంటికి వెళ్లారు. వారి ఇంటికి సమీపంలో దుర్వాసన రావడంతో అక్కడికి వెల్లి చూశారు. అక్కడ జంతువులు తిరుగుతూ ఉండడంతో అక్కడ కాస్త మట్టిని తవ్వి చూడగా ఓ మనిషి చేయి కనిపించింది.

దీంతో అనుమానం వచ్చిన మీనా కుటుంబసభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రదేశాన్ని సీజ్‌ చేశారు. ఇక ఆ ప్రదేశంలో తవ్వకాలు జరిపించగా ప్లాస్టిక్ సంచిలో ఓ మృతదేహం బయటపడింది. దానిపై ఉన్న దుస్తులను ఆధారంగా మృతదేహం మీనాదేనని కుటుంబసభ్యులు గుర్తుపట్టారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *