న్యాచురల్ స్టార్ నాని క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ హీరోకు యూత్ లో ఉన్న ఫాలోయింగ్, అమ్మాయిల ఫ్యాన్స్ గురించి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన హీరో. ఈరోజు నాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా నానికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే నాని పర్సనల్ విషయాలు, ఫిల్మ్ జర్నీ తెలుసుకోవడానికి తెగ ఇష్టపడుతున్నారు. నాని అసలు పేరు నవీన్ బాబు… కానీ సినీప్రియులకు మాత్రం నాని పేరుతో సుపరిచితం. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేసిన నాని అనుకోకుండా హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే హీరోగా సక్సెస్ అయ్యాడు.
అష్టాచెమ్మా సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుస హిట్ చిత్రాల్లో నటిస్తూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం హిట్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు ఫ్యామిలీ కుర్రాడిగా కనిపించిన నాని.. హిట్ 3 టీజర్ లో మాత్రం పక్కా ఊర మాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. గతంలో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఫస్ట్ సాలరీ గురించి, జాబ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
కెరీర్ తొలినాళ్లల్లో నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు తన ఫస్ట్ సాలరీ రూ.4000 అని.. మొదటి జీతం తీసుకున్న క్షణం తనకు ఇప్పటికీ గుర్తుందని అన్నారు. మొత్తం రూ.. 4000.. అన్ని వందనోట్లే అని.. ఆ డబ్బంతా జేబులో పెట్టుకుని బైక్ మీద తిరిగి రూంకు వస్తూ ఆ డబ్బుతో హైదరాబాద్ సగం కొనాలనుకున్నట్లు తెలిపాడు. నాని కెరీర్ జెర్సీ, శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న వంటి హిట్ చిత్రాలు ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..