
సినిమా ఇండస్ట్రీలో త్రిషది సుదీర్ఘ ప్రస్థానం అని చెప్పుకోవచ్చు. గత 20 ఏళ్లుగా ఆమె హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే ఉంది. 40 ఏళ్ల వయసు దాటినా ఇప్పటికీ అదే అందం, అభినయంతో ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. ఈ అందాన్ని చూసి టీనేజ్ అమ్మాయిలు, కుర్ర హీరోయిన్లు సైతం కుళ్లుకుంటారంటే అతి శయోక్తి కాదు. సినిమాలు తప్పితే ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోని త్రిష గురించి అప్పుడప్పుడు కొన్ని రూమర్లు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయంలో తరచూ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. అయితే అవన్నీ రూమర్లు గానే మిగిలిపోయాయి. ఇప్పుడు మరోసారి త్రిష పెళ్లి వార్తలు తెరమీదకు వచ్చాయి. దీనికి కారణం సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఫొటోలే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ట్రెడిషినల్ ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఆకుపచ్చ రంగు చీరలో ఎంతో అందంగా కనిపించింది. ఇక శారీ కలర్ కు మ్యాచింగ్ గా మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి అచ్చం అతిలోక సుందరిలా కనిపించింది. ఈ ఫొటోలకు ‘ ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.
త్రిష షేర్ చేసిన ఈ పోస్ట్, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ పోస్ట్ తో త్రిష అసలు ఏం చెబుతోంది? అంటూ అభిమానులు తల గొక్కుంటున్నారు. త్రిష గుడ్ న్యూస్ చెప్పనుందా? తనకు కాబోయే వాడితో ఎంగేజ్ మెంట్ చేసుకుందా? అని మరికొందరు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. అలాగే త్రిష ముఖంలో పెళ్లి కళ కనిపిస్తుందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటో వెనక ఉన్న పరమార్థం ఏమిటో త్రిష నే చెప్పాలి.
త్రిష లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
ఇక సినిమాల విషయానికి వస్తే.. త్రిష ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించింది. ఆ రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. మళయాలంలో ఆమె నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఐడెంటిటీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అజిత్ తో కలిసి త్రిష నటించిన విదాముయార్చి (తెలుగులో పట్టుదల) భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ హాసన్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలు త్రిష ఉన్నాయి.
గ్లామరస్ లుక్ లో బ్యూటీ క్వీన్..
View this post on Instagram
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.