Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

Aha OTT: ఆహా ఓటీటీలో శివన్న బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?


కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్నఆర్ సీ 16(వర్కింగ్ టైటిల్ ) సినిమాలో శివన్న కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. జాన్వీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా గతేడాది శివన్న నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భైరతి రణగల్’. నవంబర్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కన్నడ ఆడియెన్స్ ను బాగా మెప్పించింది. అందుకే రెండు వారాల తర్వాత తెలుగులోనూ (నవంబర్ 30) విడుదలై ఇక్కడ కూడా మంచి వసూళ్లు సాధించింది. ఇందులో శివరాజ్ కుమార్ ఓ పవర్ ఫుల్ లాయర్ గానూ, అదే సమయంలో పేదల పక్షాన పోరాడే నాయకుడిగానూ అద్భుతంగా నటించాడు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించిన భైరతి రణగల్ ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో కన్నడ భాషలో శివన్న మూవీ ఈ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే భైరతి రణగల్ తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఫిబ్రవరి 13 నుంచి శివన్న సినిమా తెలుగు వెర్షన్ అందుబాబులోకి రానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా.
నర్తన్ తెరకెక్కించిన ‘భైరతి రణగల్’ సినిమాలో శివరాజ్ కుమార్ సరసన సప్త సాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ‘గీతా పిక్చర్స్’ బ్యానర్ పై శివన్న భార్య గీతా శివరాజ్‌కుమార్ ఈ సినిమాను నిర్మించారు. రాహుల్ బోస్, అవినాశ్, దేవ రాజ్, ఛాయా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేజీఎఫ్, సలార్ ఫేమ్ రవి బ్రసూర్ సంగీతం అందించారు. మరి థియేటర్లలో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

 మరో రెండు రోజుల్లో ఆహాలో స్ట్రీమింగ్..

భైరతి రణగల్ సినిమాలో శివరాజ్ కుమార్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *