Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. క్రేజీ కాంబో అదిరిపోయింది..

Allu Arjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. క్రేజీ కాంబో అదిరిపోయింది..


పుష్ప 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ ప్రాజెక్ట్ థియేటర్లలో రూ.1600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన నెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా బన్నీ కొత్త సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్ సినిమా కంటే ముందే అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో ఓ సినిమా చేయనున్నాడనే టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో నటుడు అల్లు అర్జున్ సరసన నటి జాన్వీ కపూర్ కథానాయికగా నటించనుందని సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో జాన్వీ కపూర్ పోషించే పాత్ర పై ఇప్పటివరకు సరైన క్లారిటీ రాలేదు. ఇంతకు ముందు జాన్వీ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు పుచ్చి బాబు సనా దర్శకత్వంలో ఒక చిత్రంలో నటించనుంది.

ఇవి కూడా చదవండి

జాన్వీ కపూర్ తన సినిమాల ఎంపిక విషయంలో అచి తూచి నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ జాన్వీ కెరీర్ మలుపు తిప్పడం ఖాయంగా కనిపిస్తుంది. దర్శకుడు అట్లీ సల్మాన్ ఖాన్ తో యాక్షన్ సినిమా చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి తాత్కాలికంగా A6 అని పేరు పెట్టారు. ఇందులో రజనీకాంత్ తో పాటు ఖాన్ కూడా కనిపిస్తారని చెబుతున్నారు.

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *