ఐకాన్ స్టార్ వర్సెస్ సూపర్‌స్టార్… ఈ పోటీలో కెప్టెన్ నెల్సన్ ఎటు మొగ్గుతున్నారు. ఎవరిని సెట్‌కి పిలుస్తున్నారు? బన్నీతో నెల్సన్ ప్రాజెక్ట్ మొదలయ్యేదెప్పుడు.. ఇలాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరికిందిప్పుడు.. ఆ జవాబేంటో మనం కూడా వినేద్దం పదండి….
పుష్ప2 సెట్లో నిర్విరామంగా పనిచేస్తున్నారు పుష్పరాజ్ అలియాస్ బన్నీ. నవంబర్‌లో షూట్ చేసే స్పెషల్ సాంగ్‌తో ఈ సినిమా షూటింగ్‌కి గుమ్మడికాయ కొడతారు. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ స్క్రీన్స్ మీద సందడి చేయడానికి రెడీ అవుతున్నారు బన్నీ
పుష్ప2 తర్వాత వాట్ నెక్స్ట్ అంటే మొన్న మొన్నటిదాకా చాలా రకాల వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు గురూజీ సెట్స్ కి బన్నీ వెళ్లడం ఖాయం అనే మాట స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.
త్రివిక్రమ్ సెట్స్ కి బన్నీ వెళ్తారనే విషయాన్ని కెప్టెన్ నెల్సన్ మాటలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఐకాన్ స్టార్‌ని కలిసి కథ చెప్పానన్నారు నెల్సన్. అయితే తమ కాంబో సెట్స్ మీదకు వెళ్లడానికి సమయం పడుతుందన్నారు. జైలర్ సినిమా రిలీజ్ కాగానే బన్నీని కలిసినట్టు చెప్పారు నెల్సన్.
ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా పనుల్లో ఉన్నారు. అది పూర్తి కాగానే నెల్సన్‌తో జైలర్2 చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ వేగం పెంచేశారు నెల్సన్. సూపర్‌స్టార్ ఐ యామ్ కమింగ్ అని చెప్పేలోపే లొకేషన్ల వేట కంప్లీట్ చేసుకుని పక్కాగా రెడీగా ఉండాలన్నది నెల్సన్ ప్లాన్. సో, జైలర్ సీక్వెల్ పూర్తయ్యాకే బన్నీతో నెల్సన్ మూవీ ఉండొచ్చన్నమాట.