ఉసిరిలో ఉండే విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ శోషణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి, కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. ఉసిరిలోని టానిన్లు రక్తస్రావ నివారిణిగా పనిచేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలు. ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.
ఎండు ఉసిరిలోనూ విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పోషకాల గని అంటారు. బాగా ఎండిన ఉసిరిముక్కలు ఏడాది పొడవునా వాడుకోవచ్చు. ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచటంతో పాటు ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడటానికి ఇది మెరుగ్గా పనిచేస్తుంది.
కొల్లాజన్ కణజాలాన్ని రక్షించి, వృద్ధాప్య లక్షణాలని రాకుండా చూస్తుంది. ఉసిరికాయలలో యాంటీ ఏజింగ్ లక్షణాలతో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఎండిపోయిన ఉసిరి ముక్కల్ని తింటే, వృద్ధాప్య లక్షణాలు తగ్గించుకోవచ్చు.
చర్మంపై ఏర్పడే ముడతలు, గీతలు వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా తగ్గించడంలో సహాయపడవచ్చు. దీన్ని పొడిగా తయారు చేసుకుని, తేనె కలిపి కూడా తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. చర్మం పై ముడతలు రాకుండా ఉసిరి కాపాడుతుంది.
ఉసిరి తీసుకోవటంతో నోటి పూతని తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా ఉసిరిని వాడడం మంచిది. షుగర్ ఉన్నవాళ్లు ఉసిరిని తీసుకుంటే అది వారికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అంతే కాకుండా, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఉసిరిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.. ఉసిరిని మనం జ్యూస్ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు.
పొడి ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చిన్న వయస్సులోనే జుట్టు నెరవడాన్ని నివారించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇది తలకు పోషణ ఇస్తుంది. చుండ్రును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.