Anakapalle: ఆ చిన్నారి మైండ్ మ్యాపింగ్ నిజంగా మైండ్ బ్లోయింగ్

Anakapalle: ఆ చిన్నారి మైండ్ మ్యాపింగ్ నిజంగా మైండ్ బ్లోయింగ్


అనకాపల్లి జిల్లా బాపాడుపాలెం అనే చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఒక అద్భుతానికి వేదిక అయింది. అక్కడ చదువుతున్న ఒకటవ తరగతి చిన్నారి ఆరాధ్య, తన మేధస్సు, సృజనాత్మకతను ఒక చిన్న మైండ్ మ్యాప్ రూపంలో ప్రజెంట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పాఠశాల అంటే కేవలం పుస్తక విజ్ఞానం నేర్పే స్థలం మాత్రమే కాదు. విద్యార్థి ఆలోచనాశక్తిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రదేశం కూడా. ఆరాధ్య రూపొందించిన మైండ్ మ్యాప్ చూస్తే, ఈ మాట అక్షరాలా నిజమని నొక్కి చెప్పాల్సిందే.

తాను ప్రతిరోజూ ఎదుర్కొనే అంశాలు, నేర్చుకునే విషయాలు, తనకు నచ్చిన విషయాలన్నిటినీ జ్ఞాపకశక్తిని పెంపొందించే మైండ్ మ్యాప్ రూపంలో ఎంతో చక్కగా రూపొందించింది ఆరాధ్య. ఇది ఆమె వయసుకు మించిన అవగాహనతో కూడిన ప్రయత్నం. ఓ జ్ఞానపిపాసు విద్యార్థికి ఉండాల్సిన దృష్టి, అవగాహన, పట్టుదల అన్నీ ఆ మైండ్ మ్యాప్‌లో స్పష్టంగా కనిపించాయి. ఈ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఆరాధ్య ఉపాధ్యాయుడు గంగాధర్ రావు ప్రశంసనీయులు. ఆయన నిబద్ధత, విద్యార్థులపై చూపిన శ్రద్ధే ఈ విజయానికి మౌలికాధారం. ఇటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉంటే… ఇంకా ఎన్నో చిట్టి చిమ్మందులు వెలుగులోకి వస్తారు.

మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందన

ఈ అద్భుతంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రినారా లోకేష్ ప్రత్యేకంగా స్పందించారు.అనకాపల్లి జిల్లా బాపాడుపాలెం MPP పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారి ఆరాధ్య తన సృజనాత్మకతతో రూపొందించిన మైండ్ మ్యాపింగ్ మైండ్ బ్లోయింగ్! ఆమెకు ఆశీస్సులు. చిన్నారిని చిచ్చరపిడుగులా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడు గంగాధర్ రావు గారికి అభినందనలు. పిల్లల ఆసక్తికి, తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఉపాధ్యాయుల కృషి తోడైతే, ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి అద్భుతాలు మరెన్నో సాధించవచ్చు,” అని అన్నారు.

ఇది కేవలం ఒక చిన్నారి రూపొందించిన మైండ్ మ్యాప్ మాత్రమే కాదు… ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు సాధించడానికి తగిన వాతావరణం, నిబద్ధ ఉపాధ్యాయులు, ప్రోత్సాహక కుటుంబాలు ఉంటే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు రావచ్చో చెప్పే సందేశం కూడా. ఈ సందర్భంలో ఆరాధ్యకు మనమందరం అభినందనలు తెలియజేద్దాం. అలాగే, గంగాధర్ రావు గారు లాంటి ఉపాధ్యాయులు ఇంకా ఎక్కువమంది వెలుగులోకి రావాలనుకోవడం విద్యావ్యవస్థ పట్ల మన ఆశాభావానికి నిదర్శనం అవుతుంది.

వీడియో దిగువన చూడండి…

rel=”noopener”>ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *