Andhra: ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. తెల్లారేసరికి..

Andhra: ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. తెల్లారేసరికి..


Andhra: ఏకాంతం కోసం లాడ్జి‌లో దిగిన ప్రేమజంట.. కట్ చేస్తే.. తెల్లారేసరికి..

ఇద్దరు ప్రేమికులు.. మనసు విప్పి మాట్లాడాలనుకున్నారు. పార్క్‌లు, థియేటర్ల అయితే డిస్టర్బ్ అని భావించి లాడ్జీకి వెళ్లారు. అలా వెళ్లి ఇలా వచ్చారు.. బట్ గ్యాప్‌లో చాలా జరిగింది. బయటకు చెప్పుకోలేక.. బాధను దిగమింగుకోలేక సతమతమయ్యారు. అసలు లాడ్జీలో ఏం జరిగింది..? వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంలోని శ్రీ రాఘవ రామ లాడ్జి అది. కొద్దిరోజుల క్రితం ఓ ప్రేమజంట ఈ లాడ్జీకి వెళ్లింది. ఓ రూమ్‌ అద్దెకు తీసుకుంది. కొద్ది గంటలు ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్లకు ఓ కాల్ వచ్చింది. ఫలానా లాడ్జీలో మీ రొమాన్స్‌ చిత్రం.. మా చేతిలో ఉంది.. డబ్బు ఇస్తే సరి అంటూ కాల్ కట్ చేశారు. ఆ మాట విని ప్రేమికులిద్దరూ షాకయ్యారు. షాక్‌ నుంచి తేరుకోకముందే మరోసారి కాల్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు లేదని చెప్పడంతో.. వీడియోలు వైరల్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భావించిన ప్రియురాలు.. తన దగ్గరున్న బంగారాన్ని అమ్మి వాళ్లు అడిగినంత డబ్బు ఇచ్చేసింది.

ఇది చదవండి: మూసీ నది వెంబడి ఆగని చప్పుళ్లు.. ఏంటని కెమెరాకు పని చెప్పగా..

కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన లాడ్జీ సిబ్బంది.. మళ్లీ ఆ.. జంటకు కాల్ చేసి మరో లక్ష అడిగారు. ఇదిలాగే కంటిన్యూ అవుతుందని భావించిన ప్రేమికులు.. కాస్త ధైర్యం చేసి పోలీసుల్ని ఆశ్రయించారు. జరిగిందంతా వివరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లాడ్జీకి వెళ్లి రూమ్‌లో అమర్చిన కెమెరాలు, డిజిటల్ ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. లాడ్జీ యజమాని మాత్రం సీక్రెట్ కెమెరాలతో షూట్ చేసిన విషయాన్ని ఖండించారు.

ఇది చదవండి: ఒకప్పుడు ఈ హీరోయిన్‌ను కుక్కతో రీప్లేస్ చేశారు.. ఇప్పుడు రూ. 163 కోట్లతో పాన్ ఇండియా ఫేమస్..

సదరు యువకుడు ఇలాగే కొంతమందిని బెదిరించినట్టు తెలిసిందని.. తప్పని తేలితే చర్యలు తీసుకోవాలన్నాడు. కాగా, ప్రైవసీ కోరుకున్న ప్రేమికులు చివరికి చిక్కుల్లోపడ్డారు. నిజంగానే లాడ్జీ సిబ్బంది ప్రేమజంట వీడియోలు తీశారా? లేదంటే ఊరకే డబ్బు కోసం బెదిరిస్తున్నారా? పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు బయటికొస్తాయన్నది చూడాలి.

ఇది చదవండి: బాబోయ్‌.. ఇది బాహుబలి కారు అండీ.! 754 కిమీ రేంజ్.. ధర తెలిస్తే బిత్తరపోతారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *