వంటింటి మహరాణులు.. సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్లు.. కాస్త కఠినంగా మాట్లాడితే నొచ్చుకునేవాళ్లు.. ఇది ఆడవాళ్లపై జనరల్‌గా అందరికి ఉండే అభిప్రాయం. అలాంటివాళ్లు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? కట్టుకున్న వాడిని ఖండ ఖండాలుగా నరికి చంపేస్తున్నారు. భార్య చేతిలో బలైపోయిన మరో భర్త కథ ఇది. ఈ దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. భర్తను చంపి ఏకంగా డోర్ డెలవరీ చేసింది ఓ భార్య. జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణయ్య అనే వ్యక్తిని.. పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20ఏళ్ల క్రితం పెళ్లయింది. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
ఆమె మనసు మార్చుకుని కాపురానికి వస్తుందేమో అని కొన్ని రోజులు ఎదురుచూశాడు రమనయ్య. రాకపోవడంతో నచ్చజెప్పేందుకు తనే వాళ్ల ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ ఇంటి అల్లుడిని గౌరవించకపోగా.. ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఘర్షణ పెద్దది కావడంతో రమణమ్మ ఆమె సోదరుడు కలిసి రమణయ్య కళ్లలో కారం చల్లి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడు స్పాట్‌లోనే మృతిచెందాడు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అతడి ఇంటి దగ్గరే పడేసి వెళ్లిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి