Andhra Pradesh: అమెరికాలో ఉద్యోగం అనగానే లక్షలు అప్పజెప్పారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?

Andhra Pradesh: అమెరికాలో ఉద్యోగం అనగానే లక్షలు అప్పజెప్పారు.. అసలు ట్విస్ట్ ఏంటంటే..?


ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగం అది అమెరికా ఇమ్మిగ్రేషన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ప్రచారం చేశారు. ఇది నమ్మి ముగ్గురు అక్కాచెల్లెళ్లు వచ్చారు. వారి వద్ద నుండి రూ.37 లక్షలను వసూలు చేశారు. ఆ తర్వాత అది ఫేక్ తెలియడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. గుంటూరు కొరిటెపాడులో ఏవియేషన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 2024లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అరండల్ పేటకు చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ కోర్సుకు సంబంధించి ఆ సంస్థను సంప్రదించారు. దీంతో వారి వద్ద నుండి లక్ష రూపాయలను వివిధ ఫీజుల రూపంలో తీసుకున్నారు. ఆ తర్వాత అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఉద్యోగాల భర్తికి నోటిఫికేషన్ ఇచ్చారని ఆరు నెలల పాటు అమెరికాలో ఉద్యోగం చేసిన తర్వాత వర్క్ ఫ్రం హోం చేయవచ్చని చెప్పారు. దీంతో వారి మాయ మాటలు నమ్మిన అక్కాచెల్లెళ్లు ఆ ఉద్యోగాల కోసం డబ్బులు చెల్లించడం మొదలు పెట్టారు.

ఆ ఉద్యోగాలకు అవసరమైన ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికేట్‌ను ఆ సంస్థ డైరెక్టర్ ఇప్పిస్తాడని నమ్మబలికారు. అమెరికాలో జాబ్ దరఖాస్తు కోసం 2500 డాలర్లు చెల్లించాలని చెప్పారు. వీసా, పాస్‌పోర్ట్‌కు ఇరవై లక్షల ఖర్చవుతుందని ఇతర అవసరాల కోసం మరో ముప్పై లక్షల అవసరం అవుతాయంటూ దశల వారీగా డబ్బులు కట్టించుకున్నారు. వీరి మాటలు నమ్మిక వాళ్లు డబ్బులు చెల్లించారు. ప్రతి నెల ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అంటూ కార్యాలయం చుట్టూ తిప్పుకునేవారు.

తిరిగి తిరిగి విసిగి వేసారిన అక్కా చెల్లెళ్లు అసలు ఏం జరుగుతుందని ఆరా తీశారు. అప్పుడు తమలాగే చాలామందిని మోసం చేసినట్లు తెలిసింది. తమ డబ్బులు తమకి తిరిగి ఇవ్వకుండే పోలీసులకు చెబుతామని హెచ్చరించడంతో 6.5 లక్షలను వెనక్కి ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా బెదిరిస్తున్నారు. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *