అనికా సురేంద్రన్ బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. 2019లో విడుదలైన తమిళ చిత్రం 'విశ్వాసం'లో అజిత్, నయనతారల కుమార్తె పాత్రలో నటించి ఆమె ప్రసిద్ధి చెందింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తరువాత ఆమెకు ఆఫర్స్ వచ్చాయి.
ఇప్పుడు అనిక హీరోయిన్గా కనిపిస్తోంది. ఆమె వయసు ప్రస్తుతం 20 ఏళ్లు మాత్రమే. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అనిక.. ఇటు సినిమాల్లో నటిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయంపై క్లారిటీ ఇచ్చింది.
నా వయసు 20 సంవత్సరాలు అని తెలిపింది. ఇంటి చిరునామా, మొబైల్ నంబర్ గురించి అడగ్గానే షాకయ్యింది. . తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నారా అని అడిగినప్పుడు, అనికా “లేదు” అని సమాధానం ఇచ్చింది. దీంతో రూమర్స్ కు తెర దించింది.
అనిక ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో బిజీగా ఉంది. వారికి ఇక్కడ చాలా ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె 'వాసువిన్ గుర్బింగల్' చిత్రంలో నటిస్తున్నారు. అనిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
ఆమె సోషల్ మీడియాలో రకాల షూట్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె ఫాలోవర్స్ సంఖ్య సైతం పెరిగింది. భవిష్యత్తులో ఆమె హీరోయిన్గా మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటారో వేచి చూడాల్సిందే.