AP News: గుడి సమీపాన పురావస్తు తవ్వకాలు.. మట్టిలో కనిపించింది వెలికితీయగా..

AP News: గుడి సమీపాన పురావస్తు తవ్వకాలు.. మట్టిలో కనిపించింది వెలికితీయగా..


ప్రకాశం జిల్లాలో మరో నాగశాసనం వెలుగు చూసింది. కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మాన్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నాగ శాసనాన్ని గ్రామస్థుడు కురంగి నాగేశ్వరరావు గుర్తించారు. ఇదేదో పురాతన శాసనంలా ఉందని భావించిన ఆయన ఆ నాగ శాసనం ఫోటోలు తీసి శాసన పరిశోదకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ కు పంపారు. దీనిని పరిశీలించిన మీదట ఈ నాగ శాసనం పై 13వ శతాబ్దపు లిపి ఉందని నిర్ధారించుకున్నారు. సిద్ధి రాజు తిమ్మరాజు గుడిదగ్గర భోగ మండపం కట్టించిన సందర్బంగా నాగ శాసనం వేసినట్టు అందులో లిఖించారు. ఈ 13వ శతాబ్దపు నాగశాసనాన్ని అరుదైన 10 వ శతబ్దపు కాలంలో నిర్మించిన సుబ్రహ్మాణ్యేశ్వర స్వామి వారి ఆలయం అభివృద్దిలో భాగంగా లిఖించినట్టు గుర్తించారు. ఇలాంటి అరుదైన దేవాలయాలను, శాసనాలను పరిరక్షించు కోవడం అందరి బాధ్యత.

ఇది చదవండి: పుష్ప 2 మూవీలో ఈ హీరోయిన్ ఎవరో తెల్సా.. బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ప్రకాశంజిల్లాలో ఎక్కడ చూసినా నాగశాసనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్నాళ్ళూ వాటిని గుర్తించే వారు లేక మరుగున పడిన శాసనాలను ఇటీవల కాలంలో చరిత్ర పరిశోధకుల కృషివల్ల ఎక్కువగా బయటపడుతున్నాయి. 10 శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు వివిధ దేవాలయాల్లో చేసిన అభివృద్ది పనులు, నిర్మాణాలను వివరిస్తూ అప్పటి రాజుల, ధర్మదాతల విశేషాలను ఈ నాగశాసనాల తెలుసుకునే అవకాశం కలుగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల విజయనగర పాలకుల మరో శాసనం వెలుగులోకి వచ్చింది. ప్రకాశంజిల్లా బేస్తవారిపేట మండలం బసినేపల్లి – చెరుకుపల్లి గ్రామాల మధ్య ఏకరాతితో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 15వ శతాబ్దం కాలంలో నిర్మించిన శాసనం వెలుగు చూసింది. తాజాగా కురిచేడు మండలం దేకనకొండ గ్రామంలోని శ్రీ సుబ్రహ్మాన్యేశ్వర స్వామి ఆలయం సమీపంలోక మరో నాగశాసనాన్ని గుర్తించారు. దీనిని పరిశీలిస్తే ఈ నాగ శాసనం పై 13వ శతాబ్దపు లిపి ఉంది. దేవాలయం సమీపంలో భోగ మండపం కట్టించిన సందర్బంగా నాగ శాసనం వేసినట్టు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు.

Ap

 

ఇది చదవండి: ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో ఏంటని చూడగా

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *