ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల పలు వ్యాధులకు దూరంగా ఉంచవచ్చని వైద్యులు చెబుతుంటారు. యాపిల్ పండులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో లభించే విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది.
కొందరు ఆపిల్స్‌ను తొక్క తీసి లోపల ఉన్న విత్తనాలను తొలగించి తింటారు. కానీ కొంతమంది ఆ విత్తనాలను కూడా కలిపి తినేస్తుంటారు. యాపిల్ విత్తనాలు తినడం వల్ల అనేక సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతారు.
ఆపిల్ గింజల్లో సాధారణంగా అమిగ్డాలిన్ అనే విషపూరిత సమ్మేళనం ఉంటుంది. ఆపిల్ గింజలను తిన్నప్పుడు, అమిగ్డాలిన్ శరీరంలో హైడ్రోజన్ సైనైడ్గా మారుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. అందుకే పెద్ద మొత్తంలో ఆపిల్ గింజలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అమిగ్డాలిన్ ఎక్కువగా ఆపిల్, బాదం, ఆప్రికాట్లు, పీచెస్, చెర్రీస్ మొదలైన పండ్లలో కనిపిస్తుంది.
ఇది శరీర కణాలకు ఆక్సిజన్ చేరకుండా నిరోధిస్తుంది. అంతే కాదు చిన్న మొత్తంలో సైనైడ్ కూడా శరీరానికి స్వల్పకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. ఇది తలనొప్పి, గందరగోళం, అలసట, బద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో పెద్ద మొత్తంలో సైనైడ్ చేరితే అధిక రక్తపోటు, స్ట్రోక్, మూర్ఛ వంటి తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు.
కొన్నిసార్లు ఇది కోమా, మరణానికి కూడా దారితీస్తుంది. అమిగ్డాలిన్ ప్రాణాంతకం కాకపోయినా ఇది శరీరానికి హానికరం. అందుకే చిన్న పిల్లలకు యాపల్ ఇచ్చినప్పుడు విత్తనాలను తొలగించాలి.