అశ్విని శ్రీ.. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో ఒకరు. బిగ్‌బాస్ 7వ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల తార విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందు పలు తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ లో నటించింది అశ్విని శ్రీ. బీటెక్ బాబులు, నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్, అమీర్ పేటలో వంటి చిన్న సినిమాల్లో తళుక్కుమంది. అలాగే పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, రవితేజ రాజా ది గ్రేట్ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ మెరిసింది. ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో బిజీగా ఉంటోన్న అశ్విని శ్రీ తన పుట్టిన రోజును వినూత్నంగా జరుపుకొంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీలు తమ పుట్టిన రోజులు ఇంటి సభ్యులతో, స్నేహితులు, సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకుంటారు. అది కూడా పెద్ద పెద్ద హోటళ్లలో, రిసార్ట్స్ లలో విందులు, వినోదాల్లో మునిగి తేలుతారు. అయితే అశ్విని శ్రీ మాత్రం అనాథలతో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. తద్వారా తనకు అందమే కాదు.. అంత కన్నామంచి మనసు ఉందని నిరూపించుకుంది.
తన పుట్టిన రోజు సందర్భంగా ఓ అనాథశ్రమానికి వెళ్లిన అశ్విని శ్రీ అక్కడ ఉన్న పిల్లలకు నాన్ వెజ్ వంటకాలు తానే స్వయంగా వడ్డించింది. అంతేకాదు ఆ పిల్లలతో చాలా సేపు సరదాగా గడిపింది. ‘తగ్గేదేలే’ అంటూ పిల్లలతో అల్లరి చేసి వారి కళ్లల్లో ఆనందాన్ని నింపింది. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇతరుల కోసం జీవించకపోతే.. అసలు అది జీవితమే కాదు’ అంటూ తన వీడియోకు ఒక క్రేజీ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అశ్విని శ్రీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘సూపర్బ్ మేడమ్.. మీ మంచి మనసుకు హ్యాట్సాఫ్’.. మీరు భవిష్యత్తులో ఇలాంటి సేవలు మరిన్ని చేయాలంటూ బిగ్‌బాస్ బ్యూటీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
అనాథాశ్రమంలో అశ్విని శ్రీ… వీడియో..
వీధి కుక్కలకు ఆహారం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.