Deepika Padukone: ముద్దుల కూతురికి నామకరణం చేసిన దీపిక.. ఏం పేరు పెట్టారో తెలుసా?
దీపికా పదుకొణె- రణ్ వీర్ సింగ్ 2018లో పెళ్లిపీటలెక్కారు. తమ ఆరేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఈ ఏడాది సెప్టెంబర్ లో పండంటి మహాలక్ష్మిని తమ జీవితంలోకి ఆహ్వానించారీ లవ్లీ కపుల్. ఇక దీపావళి పండగను పురస్కరించుకుని సోషల్ మీడియా వేదికగా తమ గారాల పట్టి ఫొటోతో పాటు పేరును ప్రకటించారు దీపిక-రణ్ వీర్. తమ కూతురికి దువా పదుకొణె సింగ్ అని నామకరణం చేసినట్టు వెల్లడించారు. ‘దువా అంటే ప్రార్థన. మా ప్రేయర్స్‌కు సమాధానమే ఈమె’’…