
Team India: భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త వన్డే జెర్సీ ఆవిష్కరణ: హర్మన్‌ప్రీత్ ప్రసంగం
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, బీసీసీఐ కార్యదర్శి జే షా కలిసి ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో భారత కొత్త వన్డే జెర్సీని ఆవిష్కరించారు. ఈ కొత్త జెర్సీపై ప్రత్యేకమైన ముక్కోణపు డిజైన్‌తో భుజాలపై ఉన్న రంగుల సొగసును అందంగా రూపొందించారు. ఇది డిసెంబర్ 22న వడోదరలో వెస్టిండీస్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. జెర్సీ ఆవిష్కరణ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ, ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన రోజు అని,…