
ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం! ప్రతిష్టాత్మక పురస్కారం ప్రకటించిన శ్రీలంక
భారత్-శ్రీలంక సంబంధాలను బలోపేతం కోసం చేసిన కృషికి గుర్తింపుగా, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మక మిత్ర విభూషణ పురస్కారం ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. ఇది ప్రధాని మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ పురస్కారం. మిత్ర విభూషణ పురస్కారం అనేది దేశాధినేతలకు శ్రీలంక ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం. కొలంబోలో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకే ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. శ్రీలంకతో స్నేహపూర్వక…