
10th Paper Leak Case 2025: పదో తరగతి పేపర్ లీకేజీలో 13 మందిపై కేసు నమోదు.. పరారీలో ఇద్దరు మైనర్లు!
నకిరేకల్, మార్చి 27: రాష్ట్రంలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే తెలుగు ప్రశ్నపత్రం లీక్ కావడం సంచలనంగా మారింది. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కేంద్రంలో మార్చి 21న పదో తరగతి తెలుగు పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నపత్రం వాట్సాప్‌లో చక్కర్లు కొట్టింది. ఇది కాస్తా డీఈఓకు చేరడంతో దుమారం రేగింది. వెంటనే ఎంఈవో నాగయ్యకు ఫోన్ చేయగా నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏకంగా 13…