
Telangana: పన్నీర్ కర్రీ తినదామని ఆర్డర్ ఇచ్చాడు.. సర్వ్ చేయగానే ప్లేట్‌లో కనిపించింది చూసి
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిలీల రెస్టారెంట్‌లో పన్నీరు కర్రీలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో వినియోగదారుడు కంగుతిన్నాడు. పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆకలి తీర్చుకోవడానికి రెస్టారెంట్‌కి వెళ్లాడు. బటర్ నాన్‌తో పాటు పన్నీరు కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. బటర్ నాన్ తినేందుకు ఉపక్రమించి చూసేసరికి.. కర్రీలో బొద్దింక దర్శనమిచ్చింది. దీంతో షాక్‌కు గురైన ఆ యువకుడు.. వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులకు చెబితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఇక లాభం లేక.. మున్సిపల్ అధికారులకు…