
కొబ్బరి చెట్టెక్కిన చిరుత.. మెల్లిగా చూస్తూ ఏం చేసిందంటే వీడియో
కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. తిప్పలదొడ్డి గ్రామంలో చిరుత పులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటుగా వెళ్తున్న స్థానికులు కొబ్బరిచెట్టుపై చిరుతను చూసి షాకయ్యారు. అంత ఎత్తయిన చెట్టుపైకి చిరుత ఎలా వెళ్లిందని ఆశ్చర్యపోయారు. ఏ క్షణంలో ఎవరిపైన పడుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారు. చిరుతను చూసేందుకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. కొందరు అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు….