
బాబోయ్.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు.. దీని ధరతో 12 ప్రపంచస్థాయి లగ్జరీ కార్లు కొనొచ్చట
బ్రెజిల్‌లో ‘వియాటినా-19’ అనే నెల్లూరు జాతి ఆవు రికార్డు స్థాయిలో వేలం వేసింది. అవును ఒక ఆవు ధర డజనుకు పైగా ప్రపంచ స్థాయి లగ్జరీ కార్లకు సమానం. ఇది మీకు షాక్ అనిపించినా..నెల్లూరు జాతి ఆవు ‘వియాటినా-19’ బ్రెజిల్‌లో ఇటీవల 4.8 మిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ. 35 కోట్లు వేలం వేసింది. ‘వియాటినా-19’ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. భారతదేశం నుండి బ్రెజిల్ వరకు సాగిన ఈ ఆవు ప్రయాణం…