
గేమ్ ఛేంజర్‌కు షాక్.. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోకు అనుమతి రద్దు
గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపు, స్పెషల్ షోలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుతో పాటు మార్నింగ్ స్పెషల్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆ సినిమాకు ఈ వెసులుబాటును రద్దు చేస్తూ తెలంగాణ హోంశాఖ శనివారంనాడు…