
చీలిపోతున్న భూమి.. త్వరలో మరో మహా సముద్రం !!
భూమి లోపల టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆఫ్రికా ఖండం చీలిపోయి అక్కడ కొత్తగా మరో సముద్రం ఏర్పడబోతున్నదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. రానున్న కోటి సంవత్సరాల్లో ఈ ప్రక్రియ జరిగి భూగోళంపై ఆరవ మహాసముద్రం ఆవిర్భవించే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం భూగోళంలో దాదాపు మూడొంతుల భాగం నీటితో కప్పిఉంది. ఇది అట్లాంటిక్, పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, దక్షిణ మహా సముద్రాలుగా డివైడ్ అయి ఉంది. అయితే ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి మొజాంబిక్ వరకు…