
PKL 2024: ఆశీష్ మెరిసే.. టైటాన్స్ మురిసే…పట్నా పైరేట్స్‌పై తెలుగు టైటాన్స్ విజయం
హైదరాబాద్, 28 అక్టోబర్ 2024 : ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు రెండో విజయం సాధించింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమి నుంచి పుంజుకున్న తెలుగు టైటాన్స్.. సోమవారం హైదరాబాద్‌లోని జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ దశ మ్యాచ్‌లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్‌పై మెరుపు విజయం సాధించింది. ప్రథమార్థంలో వెనుకంజ వేసిన టైటాన్స్.. ద్వితీయార్థంలో దుమ్మురేపే ప్రదర్శన చేసింది. 2 పాయింట్ల తేడాతో సీజన్లలో…