
KCR: బీఆర్ఎస్ మాస్ జాతర.. దారులన్నీ ఓరుగల్లు వైపే.. కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
14ఏళ్ల ఉద్యమం.. పదేళ్ల అధికారం.. ప్రస్తుతం ప్రతిపక్షం. మూడుముక్కల్లో చెప్పాలంటే ఇదీ బీఆర్‌ఎస్ ప్రస్థానం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించిన కేసీఆర్.. రాష్ట్ర సాధన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న కారు పార్టీ ఆవిర్భవించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో రజతోత్సవ సభను అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీకి హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి ముస్తాబైంది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా…