
IND vs ENG: శుబ్‌మన్ గిల్ దెబ్బకు మా సరదా తీరిపోయింది..! మ్యాచ్ తర్వాత బెన్ స్టోక్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా జూలై 2న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మొదలైన రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై టీమిండియా అద్భుత విజయం సాధించింది. 336 పరుగుల అతి భారీ తేడాతో ఈ గెలుపు అందుకుంది. తొలి టెస్టులో టీమిండియాపై గెలిచిన ఇంగ్లాండ్, రెండో టెస్టులో మాత్రం టీమిండియా ముందు తొలంచింది. ఈ ఓటమి తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా ఒక క్లాస్ టీమ్ అని, వరల్డ్ క్లాస్ ప్లేయర్లతో కూడిన…