Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ

Babu Delhi Tour: ఢిల్లీలో చంద్రబాబు బిజీబిజీ.. అమరావతి నిర్మాణం సహా పలు కీలక అంశాలపై చర్చ


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిశారు చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం ఢిల్లీ పర్యటన విజయవంతమైందని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకి ఎంపీలు స్వాగతం పలికారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న 15వేల కోట్ల రుణం తదితర అంశాలపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. అమరావతికి రుణాల ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్మలకు విన్నవించుకున్నారు సీఎం. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం చంద్రబాబుతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పలువురు నేతలు కలిసారు.

మరోవైపు ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి జైశంకర్ వచ్చారు. సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి జైశంకర్‌. అమరావతి నిర్మాణంలో సింగపూర్‌ను భాగస్వామిగా.. పునరుద్ధరించాలని జైశంకర్‌ను కోరారు చంద్రబాబు. వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి-పెన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని సీఎం కోరినట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జై శంకర్‌తో చంద్రబాబు చర్చించారని తెలిపారు. మనవాళ్లు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. విదేశీ పెట్టుబడులు ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి జై శంకర్‌ హామీ ఇచ్చినట్లు ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు.

ఇక ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్‌ ప్లాలెస్‌లో జరిగే మీడియా కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. మీడియా కాన్‌క్లేవ్ అనంతరం మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు వెళ్తారు చంద్రబాబు. 5.30గంటలకు థానే చేరుకుని మహారాష్ట్ర ఎన్నికల సంగ్రామంలో పాల్గొంటారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. 17వ తారీఖు సాయంత్రం వరకూ ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేస్తారు చంద్రబాబు. అనంతరం మళ్లీ తిరిగి అమరావతి బయలు దేరుతారు ఏపీ సీఎం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *