ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం (అలైహిస్సలాం) గొప్ప త్యాగాన్ని గుర్తు చేస్తుంది. అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తూ తన ప్రియ కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఆయన అచంచలమైన విశ్వాసం, భక్తికి గుర్తుగా బక్రీద్ జరుపుకుంటారు. ఇబ్రహీం భక్తిని చూసిన అల్లాహ్, కుమారుడి స్థానంలో ఒక గొర్రెను బలి ఇవ్వమని ఆదేశించాడు. ఈ ఘటన నుంచే ఖుర్బానీ సంప్రదాయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లింలు జంతువులను బలిచ్చి.. ఆ మాంసాన్ని మూడు భాగాలుగా పంచుకుంటారు. ఒక భాగం పేదలకు, మరొక భాగం బంధువులకు, మిగిలినది తమ కుటుంబానికి. ఇది త్యాగం, దాతృత్వం, పంచుకోవడంపై సందేశాన్ని తెలియజేస్తుంది.
ఈ పవిత్ర పండుగ సందర్భంగా మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ బక్రీద్ 2025 ట్రెండింగ్ విషెస్ ఉన్నాయి.
బక్రీద్ 2025 ట్రెండింగ్ విషెస్
- త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పర్వదినం మీ జీవితాల్లో శాంతి, ఆనందాలను నింపాలి. ఈద్ ముబారక్.
- ఈద్ అల్ అధా సందర్భంగా, అల్లాహ్ ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ కుటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ ఈద్-అల్-అధా.
- ప్రేమ, కరుణ, త్యాగం.. ఇవన్నీ ఈ పవిత్ర రోజున మన జీవితంలో పదిలంగా నిలవాలని ఆకాంక్షిస్తూ బక్రీద్ శుభాకాంక్షలు.
- సత్యం, విశ్వాసం, త్యాగం అనే బక్రీద్ సందేశాన్ని మీ జీవితంలో ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ.. బక్రీద్ శుభాకాంక్షలు.
- అల్లాహ్ దయ, కరుణ, ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ కురియాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్.
- మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని.. మీ జీవితం ఆనందంతో నిండిపోవాలని ఆశిస్తూ బక్రీద్ శుభాకాంక్షలు.
- ఈ పవిత్రమైన రోజున మీ ప్రార్థనలు అల్లాహ్ స్వీకరించాలని కోరుకుంటూ.. ఈద్ అల్ అధా ముబారక్.
- త్యాగం, సేవ భావనలు మీ జీవితాన్ని సంతోషంగా మార్చాలని ఆకాంక్షిస్తూ.. బక్రీద్ శుభాకాంక్షలు.
- త్యాగం వెనుక ఉన్న ప్రేమ అల్లాహ్ ను చేరేందుకు మార్గం చూపిస్తుంది. ఈ పవిత్ర రోజున మీకు శుభం కలగాలని ప్రార్థిస్తున్నాను.
- జీవితం ప్రేమ, క్షమ, త్యాగాలతో నిండి ఉండాలని కోరుకుంటూ.. ఈద్-అల్-అధా ముబారక్.
- ఈ రోజు ఖుర్బానీ ద్వారా మీరు చేసిన త్యాగాన్ని అల్లాహ్ అంగీకరించాలి. హ్యాపీ బక్రీద్.
- ఈ పవిత్ర రోజున మీరు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరాలని ఆశిస్తూ.. బక్రీద్ శుభాకాంక్షలు.
- కుటుంబం, సమాజంతో పంచుకునే త్యాగమే నిజమైన భక్తి. అలాంటి మనసున్నవారికి బక్రీద్ శుభాకాంక్షలు.
- అల్లాహ్ ఆశీస్సులతో మీ కలలు నిజం కావాలని, మీ హృదయం ఆనందంతో నిండిపోవాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్.
- ఈద్ అల్ అధా సందర్భంగా మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈద్-అల్-అధా.
- ఈ బక్రీద్ మీరు చేసే ప్రతి పనిలో అల్లాహ్ అనుగ్రహం లభించాలని కోరుకుంటూ, హ్యాపీ ఈద్ అల్-అధా.
- తనదైనదాన్ని ఇచ్చే వ్యక్తే నిజంగా ధనికుడు.. బక్రీద్ ఈ సూక్తిని మరోసారి గుర్తు చేస్తుంది. ఈద్ ముబారక్.
- జీవితంలో త్యాగమే గొప్ప సంపద.. ఈద్-అల్-అధా దీన్ని స్పష్టంగా చెబుతుంది. మీకు బక్రీద్ శుభాకాంక్షలు.
- దైవం మన భక్తిని చూసి దీవించుతాడు. ఆ భక్తికి త్యాగమే బీజం. ఈద్ అల్-అధా శుభాకాంక్షలు.
- మన స్నేహితులు, బంధువులతో పంచుకునే ప్రతి విందు, అల్లాహ్ ఆనందం. ఈద్ ముబారక్.
- ఖుర్బానీ అర్థం కేవలం మాంసం కాదు.. మన మనసు త్యాగానికి సిద్ధపడడమే. హ్యాపీ బక్రీద్.
- ఈ పవిత్ర బక్రీద్ పండుగ సందర్భంగా.. మీరు ప్రేమ, భక్తి, క్షమ, త్యాగాలతో నిండిన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ.. ఈద్ ముబారక్ 2025. మీకు ఈ పండుగలో శాంతి, అభివృద్ధి, ఆనందం కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాము.