Bathroom: బాత్‌రూమ్‌లో ఈ 5 తప్పులు చేస్తున్నారా..? జాగ్రత్త .. ఈ రోగాలు ఖాయం..

Bathroom: బాత్‌రూమ్‌లో ఈ 5 తప్పులు చేస్తున్నారా..? జాగ్రత్త .. ఈ రోగాలు ఖాయం..


ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం మన చుట్టూ ఉన్నవాటిని ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేయడంతో పాటు బాత్రూమ్‌ను ఎల్లప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోవద్దు. బాత్రూం క్లీన్‌గా లేకపోతే అది అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి ఇంట్లో కొన్ని తప్పులు సాధారణంగా కన్పిస్తాయి. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి దంతాలు, చిగుళ్ల సమస్యలకు దారితీస్తాయి. మరికొంత మంది బాత్రూమ్‌ను క్రమం తప్పకుండా క్లీన్ చేస్తారు. కానీ దీంతో పాటు పాటించాల్సిన కొన్ని బాత్రూమ్ టిప్స్ ఉన్నాయి. అవి పాటించకపోతే అనారోగ్యానికి గురవుతారు. బాత్రూంలో చాలా మంది చేసే ఆ తప్పులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఫోన్‌తో వాష్‌రూమ్‌కు వెళ్లడం

చాలా మంది ఫోన్ లేనిదే బాత్‌రూమ్‌కు వెళ్లరు. ప్రతి ఒక్కరూ ఫోన్‌కు బానిసలయ్యారు. కానీ ఇది మీ ఫోన్‌ను బ్యాక్టీరియా నిలయంగా మారుస్తుంది. టాయిలెట్ సీటులో కంటే ఫోన్‌లో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి లోపలికి ఫోన్ తీసుకెళ్లొద్దు. ఈ చిన్న విషయాలను దృష్టిలో ఉంచురకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు.

టూత్ బ్రష్‌

చాలా ఇళ్లలో పళ్లు తోముకున్న తర్వాత టూత్ బ్రష్‌‌ను బాత్ రూంలోనే వదిలేస్తారు. కానీ అలా చేస్తే బ్యాక్టీరియా అంటుకునే అవకాశం ఉంటుంది. దీని వల్ల నోటి ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. నోటి ద్వారా ఆ బ్యాక్టీరియా శరీరంలో వెళ్తుంది. టూత్ బ్రష్‌ను బాత్‌రూమ్‌కు దూరంగా ఉంచాలి. అంతేకాకుండా ప్రతి 2-3 నెలలకు మీ టూత్ బ్రష్‌ను మార్చాలి.

లూఫా క్లీనింగ్

ఈ మధ్య చాలా మంది లూఫా(బాడీ స్క్రబ్బర్) వాడుతున్నారు. శరీరం నుంచి మృతకణాలను, బ్యాక్టీరియాను తొలగించడానికి లూఫాను ఉపయోగిస్తారు. కానీ దానిని క్లీన్ చేయడం మర్చిపోతారు. బాత్‌రూమ్‌లోనే దానిని ఉంచడం వల్ల బ్యాక్టిరియా చేరే అవకాశం ఉంటుంది. దీన్ని వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

కమోడ్ మూత ఓపెన్

ఈ రోజుల్లో చాలా ఇళ్లలో అటాచ్డ్ బాత్రూమ్‌లు, వాష్‌రూమ్‌లు ఉంటున్నాయి. అలాంటి పరిస్థితిలో పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వాష్‌రూమ్‌ను ఉపయోగించిన తర్వాత మూతను తెరిచే ఉంచుతారు. దీని వల్ల బాత్‌రూమ్ గాలిలోని బ్యాక్టీరియా అంతటా వ్యాపించవచ్చు.

టవల్ పరిశుభ్రత

స్నానం చేసిన తర్వాత టవల్స్‌తో తుడుచుకుని బాత్‌రూమ్‌లోనే వదిలేస్తారు. అంతేకాకుండా బాత్‌రూమ్‌లోనే తడి టవల్స్ ఆరబెడతారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే దానిని మార్చుకోండి. ఎందుకంటే బాత్రూంలో తడి టవల్‌ను ఉంచితే, దానిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. మీరు అలాంటి టవల్‌ను ఉపయోగించినప్పుడు, అది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బాత్‌రూమ్‌లో టవల్ ఆరబెట్టకూడదు. ప్రతి రెండు మూడు రోజులకు టవల్‌ను క్లీన్ చేయాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *