Beauty Tips: మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ మీకోసం..! ఇంట్లోనే చేసుకోండిలా..!

Beauty Tips: మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ మీకోసం..! ఇంట్లోనే చేసుకోండిలా..!


Beauty Tips: మెరిసే చర్మానికి బెస్ట్ ఫేస్ ప్యాక్ మీకోసం..! ఇంట్లోనే చేసుకోండిలా..!

చింతపండును చిన్న ముక్క తీసుకొని పావుకప్పు గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నాననివ్వాలి. తర్వాత గుజ్జును వేరుచేసుకొని, అందులో ఒక చెంచా ముల్తానీ మట్టి, కొద్దిగా రోజా వాటర్ కలిపి మిశ్రమం తయారు చేయాలి. ఈ పేస్టును ముఖానికి, మెడకు అప్లై చేసి 15 నిమిషాల పాటు విడిచిపెట్టాలి. ఆపై చల్లటి నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు తగ్గి చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జులో అరచెంచా పసుపు కలిపి పేస్టును తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పసుపులోని యాంటీ సెప్టిక్ లక్షణాలు చర్మాన్ని రక్షిస్తాయి. చింతపండు సహాయంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

చింతపండు గుజ్జును తీసుకొని అందులో అరటిపండు గుజ్జు, శెనగపిండిని కలిపి మృదువైన పేస్టును తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

ఒక చెంచా చింతపండు గుజ్జులో టేబుల్ స్పూన్ నిమ్మరసం, అరచెంచా బేకింగ్ సోడా, చెంచా పంచదార కలిపి మంచి స్క్రబ్బింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై మృదువుగా రుద్ది 15 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. జిడ్డు చర్మం కలవారికి ఇది అత్యుత్తమ స్క్రబ్బింగ్ ప్యాక్‌గా పనిచేస్తుంది.

రెండు చెంచాల చింతపండు గుజ్జును తీసుకొని అందులో రెండు చెంచాల టీ డికాషన్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని దూదిలో ముంచి ముఖంపై అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేయడంతో పాటు గ్లో పెంచడానికి సహాయపడుతుంది.

చింతపండును వంటల్లో మాత్రమే కాకుండా అందం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. దీని సహజమైన రసాయనాల వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖం మెరుగు కోసం మార్కెట్‌లో లభించే కెమికల్ ప్రోడక్ట్స్‌కు బదులుగా చింతపండు లాంటి సహజ ఉత్పత్తులను ఉపయోగించడం మంచిది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించే ముందు చేతిపై ప్యాచ్ టెస్ట్ చేయండి. అలర్జీ, చర్మం ఎర్రబారడం కానీ కనిపిస్తే వెంటనే ఉపయోగాన్ని ఆపేయాలి. ఇప్పటికే చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు ముందుగా డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *