టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈహీరోపై తాజాగా కేసు నమోదైంది. ఈనెల 13న రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని తన ఇంటికి వెళ్లే సమయంలో జర్నలిస్ట్ కాలనీలోని చౌరస్తా వద్ద రాంగ్ రూట్లో వెళ్లేందుకు ట్రై చేశాడు. అదే సమయంలో అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బెల్లంకొండ శ్రీనివాస్ వాహనాన్ని అడ్డుకోగా.. కానిస్టేబుల్ మాటలు ఏమాత్రం లెక్కచేయకుండా రాంగ్ రూట్ లో వెళ్లేందుకు ట్రై చేశాడట. దీంతో కానిస్టేబుల్, బెల్లంకొండ శ్రీనివాస్ కు మధ్య కొద్ది వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ విషయం పై బెల్లంకొండ శ్రీనివాస్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక తనపై నమోదైన కేసు విషయంలో బెల్లంకొండ శ్రీనివాస్ గురువారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. అవసరం ఉన్నప్పుడు కోర్టు విచారణకు హాజరుకావాలని నటుడికి పోలీసులు సూచించినట్లు సమాచారం. అలాగే శ్రీనివాస్ కారును సీజ్ చేసి.. నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ పై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారన్ని ఆరోపణలపై కేసు నమోదైనట్లుగా సమాచారం.
చివరగా హిందీలో ఛత్రపతి రీమేక్ చిత్రంలో కనిపించారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రస్తుతం భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నారా రోహిత్, మంచు మనోజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమను మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Jubilee Hills police registered a case against actor Bellamkonda Srinivas for allegedly being rude with the police and obstructing police personnel in their duties.
Police seized his car on Thursday. @XpressHyderabad pic.twitter.com/EF6hNK2TPO
— Revanth Chithaluri (@RevanthCh_) May 15, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: వామ్మో.. తిని తిని 108 కిలోలు పెరిగిపోయిందట.. ఈ యాంకరమ్మను గుర్తుపట్టారా.. ?
Tollywood: చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ.. 16 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. హార్మోన్ ఇంజక్షన్స్ తీసుకుందంటూ..
Mahesh Babu: మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు.. బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టిన ఉదయ్ కిరణ్.. ఏ సినిమా అంటే..
Tollywood: 36 ఏళ్ల హీరోయిన్‌తో 60 ఏళ్ల హీరో లిప్ లాక్ సీన్.. దెబ్బకు కొడుకుతో ఆగిపోయిన పెళ్లి..