ముంబైలోని జోగేశ్వర్ పరిసరాల్లోని ఓ ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. పాఠశాల మైదానంలో అమర్చినట్టుగా వచ్చిన మెయిల్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఘటనా స్థలంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈ ఘటన ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపింది. ముంబైలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరితో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.. నగరంలోని జోగేశ్వరి, ఓషివారా ప్రాంతంలో గల పాఠశాల ఆవరణలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ వచ్చింది. బెదిరింపు మెయిల్‌తో వెంటనే అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది.
రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందంతో పాఠశాలకు చేరుకుని ప్రతి చోటా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదని తెలిసింది.
ఇవి కూడా చదవండి
వీడియో ఇక్కడ చూడండి..
Mumbai, Maharashtra: Visuals from outside Ryan Global School in Jogeshwari, Mumbai, which received a bomb threat via email this morning. Police and bomb squad teams are currently at the location for investigation pic.twitter.com/p8X3peId6y
— IANS (@ians_india) January 23, 2025
బెదిరింపు మెయిల్‌ను పంపిన వ్యక్తి అందులో అఫ్జల్ గ్యాంగ్ పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..