Calculator to Exams: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆ పరీక్షకు కాలిక్యులేటర్‌ అనుమతి!

Calculator to Exams: ఇంటర్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆ పరీక్షకు కాలిక్యులేటర్‌ అనుమతి!


న్యూఢిల్లీ, మార్చి 26: బోర్డు పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు సీబీఎస్సీ బోర్డు గుడ్‌న్యూస్‌ చెప్పింది. అకౌంట్స్‌ పరీక్షలో వచ్చే సుదీర్ఘ గణనల నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్ష రోజున కాలిక్యులేటర్లు వినియోగానికి అనుమతులు ఇవ్వాలన్న ప్రతిపాదనను సీబీఎస్‌ఈ పరిశీలిస్తుంది. ప్రతిపాదనలకు అనుమతి లభిస్తే నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ప్రతిపాదనపై మార్గదర్శకాలను రూపొందించేందుకు ఓ ప్యానెల్‌ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటికే CBSE బోర్డు 10, 12 తరగతుల్లో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు కాలిక్యులేటర్లను ఉపయోగించడానికి అనుమతిస్తుంది. కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISEC) 2021లో 12వ తరగతి విద్యార్థులు కాలిక్యులేటర్లను ఉపయోగించడానికి అనుమతించింది. అప్పటి నుంచి దీనిని కొనసాగిస్తున్నారు. దీంతో అకౌంట్స్‌ పరీక్షలోనూ విద్యార్ధులందరికీ కాలిక్యులేటర్‌ను అనుమతించాలని కోరుతూ పాఠ్య ప్రణాళిక కమిటీ సీబీఎస్‌ఈ బోర్డు ముందు ప్రతిపాదన ఉంచింది. దీని అమలుపై కసరత్తు జరుగుతుంది.

12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షలో ప్రాథమిక, ప్రోగ్రామబుల్ కాని కాలిక్యులేటర్‌లను అనుమతించాలని బోర్డు పాఠ్య ప్రణాళిక కమిటీ ప్రతిపాదించింది. ఇది కేవలం కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం, శాతం గణనలు వంటి సాధారణ లెక్కలకు మాత్రమే ఉపయోగించడానికి వీలుంటుందని బోర్డు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. లిక్యులేటర్‌లను అనుమతించడం వల్ల విద్యార్థుల ఒత్తిడిని తగ్గించడం, పరీక్షా పనితీరును మెరుగుపరచడానికి వీలు కలుగుతుందని పాఠ్య ప్రణాళిక కమిటీ తెలిపింది

ఇవి కూడా చదవండి

‘తెలంగాణ డీఈఈసెట్‌లో ఇంటర్‌ అర్హత మార్కులు తగ్గించాలి’

తెలంగాణ రాష్ట్రంలో టెట్, డీఎస్సీ రాయడానికి ఇంటర్‌లో బీసీ విద్యార్థులకు 45 శాతం మార్కుల నిబంధన ఉంది. అయితే డీఈఈసెట్‌ పరీక్షకు మాత్రం 50 శాతం నిబంధన విధించారు. దాన్ని తగ్గించాలని రాష్ట్ర డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం డిమాండ్‌ చేస్తుంది. 50 శాతం మార్కుల నిబంధనల వల్ల అనేక మంది బీసీ విద్యార్థులు డీఈఈసెట్‌కు దూరమవుతున్నట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *