
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి యాలకులు చాలా మంచి పరిష్కారం. ఇవి నాడీ వ్యవస్థను సడలించి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంత నిద్ర పొందడానికి సహాయపడతాయి. యాలకులు తీసుకోవడం ద్వారా కర్టిసాల్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి ఇది నిద్రలో విఘాతం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. రాత్రిపూట యాలకులు తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
లివర్, మూత్రపిండాల పనితీరు మెరుగుపడాలంటే యాలకులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో విషాలను బయటకు పంపించడానికి సహకరిస్తాయి. శరీరంలో చెడు టాక్సిన్లను తొలగించడం ద్వారా శరీరానికి శుభ్రతను అందిస్తాయి. రాత్రిపూట యాలకులు తీసుకోవడం వల్ల శరీరం సహజంగానే శుభ్రపడుతుంది.
శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు యాలకులు వాడటం వల్ల ఉపశమనం పొందుతారు. దగ్గు, ఉబ్బసం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి ఎంతో సహాయపడతాయి. యాలకులు శ్లేష్మాన్ని తొలగించి ఊపిరితిత్తులలో వాపును తగ్గించి గాలి ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. ఇలా శ్వాస సక్రమంగా ఉండేందుకు యాలకులు సహాయపడతాయి.
మనసులో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవడానికి యాలకులు ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఉండే సమ్మేళనాలు కార్టిసాల్ స్థాయిలను తగ్గించి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. పడుకునే ముందు యాలకులు తీసుకోవడం వల్ల మీరు ప్రశాంతంగా, భావోద్వేగ స్థిరత్వంతో నిద్రలోకి వెళ్తారు. ఇది మానసిక ప్రశాంతతను తీసుకొచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది.
యాలకులలో వేడిని కలిగించే లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియను మెరుగుపరచి, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా యాలకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. రాత్రిపూట యాలకులు తీసుకోవడం ఆకలిని తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచి బరువు నిర్వహణలో సహాయపడతాయి.
యాలకులలో ఉండే సహజ సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవడానికి, మధుమేహ వ్యాధిగ్రస్తులు రాత్రిపూట యాలకులతో టీ లేదా నీరు తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
కడుపు సంబంధిత సమస్యలు, వాపు వంటి అసౌకర్యాలు ఉంటే యాలకులు మంచి పరిష్కారం. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలకు కూడా ఉపశమనం కలిగించడంలో ఇవి దోహదపడతాయి.