
Special Education Jobs: కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు మంజూరు.. సర్కార్ ఉత్తర్వులు జారీ
అమరావతి, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీ, 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. త్వరలో విడుదల చేయనున్న డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పెషల్ ఎడ్యుకేషన్ కింద మంజూరైన ఈ పోస్టులను ఆటిజం సహా మానసిక వైకల్యం కలిగిన విద్యార్ధులకు విద్యను బోధించనున్నారు. ఈ…