
Dog Vs Cat: కుక్క VS పిల్లి.. విశ్వాసం.. తెలివితేటల రేసులో ఏది ముందో తెలుసా?
కుక్కలకు తెలివైన జీవులనే పేరుంది. దీనికి బలమైన కారణాలున్నాయి. వేల సంవత్సరాలుగా కుక్కలను మనుషులు తమ పనులకు వినియోగించుకుంటున్నారు. గొర్రెల కాపరిగా, ఇళ్లకు కాపలాగా, చూపులేని వారికి మార్గదర్శకులుగా, గాలింపు రక్షణ చర్యల్లో సహాయకులుగా కుక్కలు సేవలందించాయి. మనుషుల ఆదేశాలను అవి త్వరగా నేర్చుకుంటాయి. అనేక కుక్కలు పదాలను, సంజ్ఞలను, భావోద్వేగాలను గుర్తించగలవు. “కూర్చో”, “ఉండు”, “తీసుకురా” అని మీరు ఆదేశిస్తే, అవి సంతోషంగా వింటాయి. సరిగ్గా చేసేవరకు మళ్ళీ మళ్ళీ చేస్తాయి. మనుషుల ఆమోదం వాటికి…