
Tollywood : అప్పుడు రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా సినిమాలకు నో చెప్పింది.. ఇప్పుడు చిరంజీవికి జోడిగా ఆ స్టార్ హీరోయిన్..
దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మెగాస్టార్‌ను విపరీతంగా ఆకట్టుకున్న స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని అనిల్ రావిపూడి…