
Tecno Spark Slim: ప్రపంచంలోనే అత్యంత స్లిమ్ ఫోన్.. విడుదల అప్పుడే..!
స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో పెద్ద కంపెనీలను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్‌ను టెక్నో రూపొందించింది. ఈ ఫోన్ వచ్చే వారం స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (WMC) 2025లో ఆవిష్కరించనున్నారు. ఈ ఫోన్ టెక్నో స్పార్క్ స్లిమ్ పేరుతో లాంచ్ కానుంది. కేవలం 5.75 మిల్లీమీటర్ల మందం కలిగిన ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. టెక్నో ఒక పత్రికా ప్రకటన ద్వారా ఫోన్ విడుదలను ప్రకటించింది….