
Raghunandan Rao: మావోల నుంచి బెదిరింపులు.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు!
అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్య ప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ.. సోమవారం సాయంత్రంలోగా ఆయన్ను హతమారుస్తానని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ మాట్లాడిన రఘునందన్‌రావు పీఏ.. ఈ బెదిరింపులపై రాష్ట్ర డీజీపీ…