
Delhi Election-2025: ఉత్కంఠ రేపుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఏయే పార్టీ ఏమేమి హామీలు ఇచ్చారు?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు వారాల గడువు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ పూర్తి బలాన్ని ప్రయోగిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. వరుసగా మూడు పర్యాయాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మరోసారి గెలుపొందాలని చూస్తుండగా.. ఈ విజయ పరంపరకు బ్రేకులు వేసి ఢిల్లీ పీఠంలో జెండా ఎగరేయాలని…