
Ind vs Eng: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సూర్యకుమార్: ప్లేయింగ్ XIలో గాయాల స్టార్ పేసర్ మాయం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ మహ్మద్ షమీ దూరంగా ఉండడం గమనార్హం. షమీ ఈ మ్యాచ్‌లో రీఎంట్రీ ఇస్తాడని అందరూ భావించినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని తుది జట్టులోకి ఎంపిక చేయలేదు. పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. వచ్చే రెండో టీ20 మ్యాచ్‌కు షమీ జట్టులో…