
Telangana: చికెన్ కొట్టేలోపు బైక్ మాయం.. మరుసటి రోజు ఉదయాన్నే షాప్ ఓపెన్ చేస్తుండగా..
వనపర్తి జిల్లాకు చెందిన గొర్రెల పెంపకందారుడు మన్యం పని మీద బైక్ తీసుకొని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం అలంపూర్ చౌరస్తాకు వచ్చాడు. చౌరస్తాలోని ఓ చికెన్ సెంటర్‌లో చికెన్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే చికెన్ షాప్ ముందు బైక్‌ను తాళంతో పాటే నిలిపాడు. ఇది గమనించిన ఓ దొంగ మన్యం చికెన్ కొట్టించుకొని వచ్చేలోపే బైక్‌తో సహా ఉడాయించాడు. చుట్టుపక్కల స్థానికులను విచారించగా బైక్‌కు సంబంధించిన ఎలాంటి సమాచారం దొరకలేదు. చివరికి…