
Z-MORH Tunnel: కాశ్మీర్ లోయలో మరో సొరంగం.. గేమ్ ఛేంజర్ కానున్న టన్నెల్ ప్రాజెక్ట్!
కాశ్మీర్ లోయలో చలికాలం కురిసే మంచు రవాణా వ్యవస్థను స్తంభింపజేస్తుంది. లోయను దాటి ఎటు వెళ్లాలన్నా ఎత్తైన హిమాలయ పర్వత శిఖరాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే భారీ హిమపాతం రోడ్డు మార్గాలను పూర్తిగా మూసేస్తుంది. దీంతో కొన్ని నెలల పాటు ఆయా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలు నిలిచిపోతుంటాయి. పర్వత శ్రేణుల్లో నివసించే గ్రామాలు, పట్టణాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతుంటాయి. ఈ పరిస్థితిని…