
Andhra News: చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. అమరావతిలో జనవరి నుంచే పనులు ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అత్యున్నత ప్రమాణాలతో నిర్మించాలన్న లక్ష్యంతో దూసుకెళ్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డిఎ 44వ సమావేశం జరిగింది. రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు అనుమతులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా 2 వేల 723 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది CRDA. దీంతో కలిపి.. ఇప్పటివరకూ రాజధానిలో మొత్తం 47 వేల 288 కోట్ల పనులకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్లయింది. జనవరి 15 నుంచి పనులు ప్రారంభిస్తామని చెప్పారు…