
Brahmamudi, December 13th Episode: ఆస్తి లాక్కునేందుకు రుద్రాణి స్కెచ్.. ఇరుక్కుపోయిన కావ్య..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. నేను కేవలం నీ పాదాల దగ్గర ఓ దీపం వెలిగించి.. సౌభాగ్యం కావాలని కోరితే.. మొత్తం ఐశ్వర్యాన్నే తీసుకొచ్చి పెడతావా.. ఇదేనా నీ స్వార్థం? నువ్వు గోవర్థన గిరిని చిటికెన వేలితో ఎత్తావు. అంతకన్నా ఈ బాధ్యత నాకు చాలా బరువు. నా భర్త మనసు మార్చి.. నా మనసు తేలిక చేస్తావు అని ఆశ పెడితే.. నా నెత్తిన ఇంత బరువు పెట్టి నన్ను నడవమంటావా.. ఇదెక్కడి న్యాయం కృష్ణా…